Header Banner

తాత కావాల్సిన వయసులో గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా బాబూ.! డేటింగ్ చేయడంలో ఈ స్టార్ హీరో తోపులే..

  Fri Mar 14, 2025 14:47        Entertainment

నిన్న (మార్చి 14న) తన పుట్టినరోజును బాలీవుడ్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ మీడియా సమక్షంలో జరుపుకున్నారు. విలేకర్లతో కలిసి కేక్‌ కట్‌ చేసిన అనంతరం, తన తదుపరి ప్రాజెక్ట్‌లు, షారుక్‌, సల్మాన్‌లతో సంబంధం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా, గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ఆమిర్‌ ఖాన్‌ వెల్లడించారు. 25 సంవత్సరాలుగా ఆమెను తెలుసునని, ప్రస్తుతం బెంగుళూరులో నివసిస్తున్న ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడని తెలిపారు. అదేవిధంగా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన మహాభారతం గురించి ఆసక్తికర వివరాలు వెల్లడిస్తూ, దానిని అత్యంత ప్రాముఖ్యతతో రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్‌ ప్రణాళికలు ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ దశలో ఉందని, సరైన టీమ్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లను కలిసిన విషయంపై మాట్లాడుతూ.. వారితో తనకు మంచి అనుబంధం ఉందని, పుట్టినరోజుల గురించి పెద్దగా మాట్లాడుకోలేదని తెలిపారు. "మీరు (మీడియా) మాపై గాసిప్స్ రాస్తారు కాబట్టి, ఈసారి మేము మీ గురించే గాసిప్స్‌ మాట్లాడుకున్నాం" అంటూ నవ్వుతూ చెప్పారు.

 

ఇది కూడా చదవండి: 'ఎస్ఎస్ఎంబీ 29'పై ఒడిశా డిప్యూటీ సీఎం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌! మ‌హేశ్-రాజ‌మౌళి కాంబోలో తొలి చిత్రం..

 

ముగ్గురి కాంబోలో సినిమా చేయాలనే ఆలోచన ఉందని, కానీ సరైన స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. 1986లో రీనా దత్తాతో అమీర్ ఖాన్ మొదటి వివాహం జరిగింది. ఈ జంటకు జునైద్‌ , ఐరా ఖాన్‌ అనే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2002లో విడిపోయారు. ఆ తర్వాత దర్శకురాలు కిరణ్‌ రావుతో నాలుగేళ్ల పాటు డేటింగ్‌ చేసి, 2005లో ఆమెని రెండో వివాహం చేసుకున్నారు అమీర్ ఖాన్. వీరిద్దరికీ ఆజాద్‌ అనే ఒక కుమారుడు ఉన్నాడు. 2021లో కిరణ్‌ రావుతో కూడా విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్.. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో ఆయన మూడో పెళ్ళికి రెడీ అవుతున్నారట. సినీ సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. రంగుల ప్రపంచంలో ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకులను అలరించే హీరో హీరోయిన్ల పర్సనల్ లైఫ్ లో కూడా అందరిలాగే ఎన్నో కష్టసుఖాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలాంటి వాటిలో ముందు వరుసలో ఉంటూ చర్చల్లో నిలుస్తుంటారు తారలు. తాజాగా ఆరు పదుల వయసులో ఆమిర్ ఖాన్ డేటింగ్ సంగతులు సినీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై సీఎం క్లారిటీ! ఏప్రిల్‌ నెలలో మూడు రోజుల పాటు..

 

భ‌లేదొంగ‌లు.. ఎత్తుకెళ్లిందెంటో తెలిస్తే షాక‌వ్వాల్సిందే.. ఏక కాలంలో ఇలా.!

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KinjarapuRamMohanNaidu #Guntur #Pressmeet #AndhraPradesh